HomeTelugu Big Storiesసింగర్‌ చిన్మయిపై తమిళ డబ్బింగ్ యూనియన్ వేటు

సింగర్‌ చిన్మయిపై తమిళ డబ్బింగ్ యూనియన్ వేటు

మీటు# ఉద్యమంలో ప్రముఖ సింగర్‌ చిన్మయి ప్రఖ్యాత తమిళ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటణపై చిన్మయిపై వేటు పడింది. సోషల్ మీడియాలో వైరముత్తుపై ‘మీ టూ’ ఆరోపణలు చేసినందుకు తమిళనాడు డబ్బింగ్ యూనియన్ తన సభ్యత్వం రద్దు చేసినట్టు ప్రస్తుతం అమెరికా కాన్సర్ట్ టూర్ లో ఉన్న చిన్మయి శ్రీపాద ట్వీట్ చేసింది. తనకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, మాట మాత్రమైనా చెప్పలేదని.. ఒక మెసేజ్ పంపి ఊరుకున్నారని తెలిపింది. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో చిన్మయి నేపథ్య గాయనిగా మాత్రమే కాకుండా పలు చిత్రాలలో హీరోయిన్‌లకు డబ్బింగ్ కూడా చెప్పింది. ఇటీవలే సూపర్ హిట్టైన ’96’ సినిమాలో ఆమె హీరోయిన్‌ త్రిషకు డబ్బింగ్ చెప్పింది.

14

శనివారం తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టులో ‘నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించినట్టు నాకు తెలిసింది. అంటే నేను ఇకపై తమిళ చిత్రాలకు డబ్బింగ్ చెప్పే వీలుండదు. నేను రెండేళ్లుగా సభ్యత్వ రుసుము చెల్లించకపోవడాన్ని కారణంగా చెప్పారు. కానీ నా డబ్బింగ్ ఆదాయం నుంచి 10% వాళ్లు తీసుకుంటూనే ఉన్నార’ని చిన్మయి ట్వీట్ లో పేర్కొంది. చిన్మయిపై వేటుకు సభ్యత్వ రుసుము చెల్లించకపోవడం కారణమని అధికారికంగా తెలిపినప్పటికీ ఈ హఠాత్ నిర్ణయానికి అసలు కారణం మాత్రం మీ టూ ఉద్యమానికి మద్దతు తెలపడమేనని భావిస్తున్నారు.

తాజాగా చిన్మయి నటుడు రాధా రవికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన మహిళలకు మద్దతుగా నిలిచింది. కేరెక్టర్ ఆర్టిస్ట్‌, రాజకీయ నాయకుడు కూడా అయిన రాధా రవి తమను లైంగికంగా వేధించినట్టు ఇద్దరు మహిళలు ఆరోపించారు. డబ్బింగ్ యూనియన్ పై అతని ఆధిపత్య ధోరణి గురించి చాలా మంది చెప్పారు. అక్టోబర్ 9న చిన్మయి ‘నా డబ్బింగ్ కెరీర్ ఇక ముగింపుకొచ్చినట్టు అనిపిస్తోంది. డబ్బింగ్ యూనియన్ కు అతనే నాయకుడు’ చిన్మయి అని ట్వీట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu