
NTR Dragon heroine:
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా డ్రాగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రష్మిక మందన్నా ఒక ప్రత్యేక పాత్రలో నటించనుంది. ఎన్టీఆర్‌తో రష్మిక కలిసి నటించడం ఇది తొలిసారి కావడం విశేషం.
ఇందులో రష్మిక కథనాయిక పాత్రలో కాకపోయినా, ఆమె పాత్ర సినిమాకు కీలకమని సమాచారం. కథను మలుపు తిప్పే పాత్రను రష్మిక పోషించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక పాత్ర చాలా పవర్ఫుల్‌గా ఉంటుందని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ చెబుతోంది.
View this post on Instagram
ఈ చిత్రంలో నాయికగా రుక్మిణి వాసంత్ ఎంపికయ్యారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమయ్యింది. ఎన్టీఆర్ ఈ సినిమాకోసం స్లిమ్ & రగ్డ్ లుక్‌తో సిద్ధమవుతున్నాడు. ఇతని లుక్ యాక్షన్ సీన్లకు తగ్గట్టుగా డిజైన్ చేయబడిందని తెలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు వదంతులేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
డ్రాగన్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఒక హై ఓక్టేన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న భారీ సినిమా ఇది.
రష్మిక మందన్నా ఇప్పటికే పుష్ప, యానిమల్, ఛావా వంటి విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ది గర్ల్‌ఫ్రెండ్ అనే ఓ ఫిమేల్ సెంట్రిక్ డ్రామాలో కూడా నటిస్తోంది.
ALSO READ: 1971లో విడుదలై అత్యధిక టికెట్లు అమ్మిన Bollywood Movie ఇదే అని మీకు తెలుసా?













