
Bollywood Movie with the highest ticket sold:
ఇప్పుడు RRR, Pushpa 2, Dangal లాంటి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాయి. కానీ, decades క్రితం ఓ చిన్న సినిమా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే 1971లో విడుదలైన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘Caravan’.
ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అయింది 1971లో. జీతేంద్ర, ఆశా పార్థెక్ లాంటి తారాగణం నటించిన ఈ మూవీ అప్పటికి రూ.3.6 కోట్లు వసూలు చేసింది. Piya Tu Ab To Aaja, Chadti Jawani వంటి పాటలు ఘన విజయం సాధించాయి. కానీ అసలు మ్యాజిక్ జరిగింది మాత్రం చైనాలో!
1979లో చైనాలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. తొలి రిలీజ్‌లోనే 8.8 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి. తర్వాత మళ్లీ మళ్లీ విడుదల అవుతూ, మొత్తంగా 30 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి – ఇది ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా సాధించలేని రికార్డు.
తాజాగా Dangal చైనాలో 4.3 కోట్ల టికెట్లు మాత్రమే అమ్మింది. Caravan దానికి ఏడింత ఎక్కువ! RRR, Pushpa 2 లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా ఈ రికార్డుకు చేరలేదు.
ప్రస్తుతం ఈ సినిమాను ఇన్‌ఫ్లేషన్ ప్రకారం లెక్కిస్తే రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసినట్లే. ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా, కథ, సంగీతం, నటనలతోనే ప్రపంచాన్ని అలరించిన Caravan, ఓ సినిమాకి ఎంత విస్తృతమైన స్వీకారం లభించవచ్చో నిరూపించింది.
ఈ చిన్న సినిమా చైనాలో ఇంతటి విజయాన్ని సాధించడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మనం ఎప్పుడూ పాన్ ఇండియా, భారీ బడ్జెట్ అంటుంటాం… కానీ, ఒక్క మంచికథే చాలు ప్రపంచాన్ని ఆకట్టుకోవడానికి!
ALSO READ: Amazon Prime Video చూసే వాళ్లకు షాక్! ఇకపై యాడ్స్ తప్పవా?