ఎన్టీఆర్, నాని ల మల్టీస్టారర్..?

టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీస్టారర్ ల సినిమాల హవా బాగా నడిచేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ఇలా చాలా మంది హీరోలు కలిసి నటించేవారు. కొద్దికాలం తరువాత ఆ తరహా సినిమాలు రావడం తగ్గిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో మళ్ళీ ఆ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. స్టార్ హీరోలు సైతం అటువంటి కథలు నచ్చితే వెంటనే సినిమాలు చేయడానికి అంగీకరిస్తున్నారు. తాజాగా దర్శకుడు హను రాఘవపూడి ఇటువంటి కథనే ఎన్టీఆర్ కు వినిపించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ కు కథ బాగా నచ్చింది.. కానీ ఇప్పట్లో సినిమా చేసే అవకాశాలు లేవు. అయితే మరో హీరోగా నాని పేరును ఆయన సూచించడం విశేషం. తన స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథలో మార్పులు చేయొద్దని.. చెప్పినట్లుగానే తీస్తే బావుంటుందని చెప్పాడట. హను రాఘవపూడి ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాని, ఎన్టీఆర్ ల డేట్స్ బట్టి సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.