HomeTelugu Big Storiesసోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఎన్టీఆర్‌ కారు

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఎన్టీఆర్‌ కారు

NTR New Lamborghini car vir

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కొత్త కార్లు అన్నా.. ఖరీదైన వాచీలన్నా మహా ఇష్టం. కొత్త ఎడిషన్ వాచీలు వస్తేచాలు.. ముందు ఆయనకు చూపించాలని చెబుతారు. ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసేందుకు ఆయన ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ కొత్త కారు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. కారు ఫీచర్స్‌ కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్‌ గ్రాఫిటే క్యాప్సుల్‌’ మోడ‌ల్ కారు ఇప్పుడు కేవ‌లం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న ఈ కారు త్వరలోనే హైదరాబాద్ రోడ్ల మీద షికారు చెయ్యబోతుంది. కాగా గతంలోనూ హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ కొన్న ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్‌ నిలిచారు.

అత్యాధునిక ఫీచర్లతో అత్యంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఫుల్ ఆటోమేటేడ్ టెక్నాలజీతో కూడిన ఈ కారు విలువ రూ.3.16 కోట్లు. కారు పూర్తి బుల్లెట్ ఫ్రూఫ్ కాగా.. 200 కి.మీ. స్పీడులో వెళుతున్నా ఎలాంటి కుదుపులు ఉండవట. ప్రస్తుతం ఈ లగ్జరీ కారును ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇదిలావుంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్లకు భారీ ట్యాక్స్ చెల్లించాల్సి రావడంతో సినీ తారలు ట్యాక్స్ మినహాయింపులు కోరుతున్న సంగతి తెలిసిందే. గతంలో కోలీవుడ్ స్టార్ హీరోలు అయిన విజయ్ దళపతి, ధనుష్ ట్యాక్స్ మినహాయింపు కోరగా కోర్టు వాటిని తిరస్కరించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తీసుకున్న కారు సైతం విదేశాల నుంచి వచ్చినదే కాబట్టి తారక్ ఏంచేస్తారనేది చూడాలి. ఈ కారు విలువ కూడా భారీగానే ఉండటంతో ట్యాక్స్ కూడా బాగానే చెల్లించాల్సి ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!