‘రివాల్వర్ రాజు’ గా సప్తగిరి!

కమెడియన్ గా టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకొని తాజాగా కామెడీ ఎంటర్ టైనర్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో హీరోగాను ఎంట్రీ ఇచ్చి, సక్సెస్ అందుకున్నారు టాలెంటెడ్ యాక్టర్ సప్తగిరి. కేవలం హాస్యానికే పరిమితం అవ్వకుండా నవరసాల్ని పండిచగలనని సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో కమెడియన్ గా రాణిస్తూనే హీరోగా కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు సప్తగిరి. ప్రస్తుతం నాగచైతన్య, కళ్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో హాస్యనటిగా నటిస్తూ తన మార్క్ కామెడీని పండించేందుకు రెడీ అవుతున్నాడు సప్తగిరి. అలానే యంగ్ హీరోలు శర్వానంద్, నాగఅన్వేష్ తదితరుల చిత్రాల్లో కూడా సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నాడు. వీటితో పాటే హీరోగా తన ద్వితీయ చిత్రానికి సంబంధించిన పనుల్లో కూడా సప్తగిరి బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ‘రివాల్వర్ రాజు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా సప్తగిరి ప్రకటించారు. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాల్ని విడుదల చేస్తామని” సప్తగిరి తెలిపారు.