ఎన్టీఆర్ సినిమా ఫైనల్ అయింది!

ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న హీరో ఎవరంటే ఎన్టీఆర్ అని టక్కున చెప్పొచ్చు. ‘జనతాగ్యారేజ్’ తరువాత ఆయన ఇప్పటివరకు తదుపరి సినిమా ప్రకటించలేదు. దీంతో ఎన్టీఆర్ ఏ దర్శకుడితో పని చేస్తాడా..? అని రోజుకో వార్త ప్రచారంలోకి వచ్చేది. దాదాపు పది మంది దర్శకులు చెప్పిన కథలు విన్నాడు మన హీరో. వాటిల్లో ఏ ఒక్కటి ఎన్టీఆర్ ను సాటిస్ఫై చేయలేకపోయింది.

అయితే దర్శకుడు బాబీ చెప్పిన కథ ఎన్టీఆర్ కు విపరీతంగా నచ్చడంతో ఆ కథను హోల్డ్ లో పెట్టాడు. తాజాగా ఈ కథతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రానికి నిర్మాతగా కల్యాణ్ రామ్ వ్యవహరించనున్నాడు. ఈ నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరపనున్నారు. వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రస్తుతం సినిమాలో హీరోయిన్, మిగిలిన టెక్నీషియన్స్ వేట జరుగుతోంది. మొత్తానికి ఎన్టీఆర్ కు ఇప్పటికి క్లారిటీ వచ్చింది.