ఎన్టీఆర్, చరణ్ మళ్ళీ మొదలు!

మెగాహీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ లు తమ సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తోన్న సినిమాపై అలానే ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాల షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ కూడా ఈరోజు నుండే మొదలయ్యాయి. మొన్నటివరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ లో పాల్గొన్న చరణ్ ఈ మధ్య కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఈరోజు నుండి మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడు.

సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి ‘రేపల్లె’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ పది రోజుల విరామం అనంతరం ఈరోజు నుండే సినిమా సెట్స్ పైకి వెళ్ళాడు. పురాతన భవనం సెట్ ఒకరి వేసి అందులో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా ఈ దసరాకు విడుదల కానున్నాయి.