
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో బీజీగా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ చిన్నప్పటి నుండి మల్టీటాలెంటెడ్ గా ఎదుగుతూ వచ్చాడు. సాధారణంగా క్లాసిక్ డాన్సర్ అయిన ఎన్టీఆర్ నాట్యం మీద అభిమానంతో నాట్యం సినిమాకి మద్దతు ఇస్తున్నారు. తాజాగా పాపులర్ కూచిపూడి డాన్సర్ సంధ్యరాజు డాన్స్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తోంది. నాట్యం అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇండస్ట్రీకి డెబ్యూ అవుతోంది సంధ్యరాజు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా మేకర్స్ నాట్యం సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఫిబ్రవరి 10న అంటే రేపు ఈ సినిమా టీజర్ ని విడుదల చేయనుండగా.. ఈ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మద్దతు ప్రకటించాడు. ప్రముఖ నటి భానుప్రియ శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషిస్తుండగా శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
కాగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో విడుదల కాబోతుంది. రాజమౌళి బృందం. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే సినిమా చేయబోతున్నాడు.
Young Tiger @tarak9999 launching the Enchanting Teaser of @sandhyaraju #Natyam
📝10th Feb At 10:08AM!
A Film by @revanthOfficial🎬@NatyamTheMovie #NTR #Sandhyaraju #Revanthkorukonda #NatyamTheMovie #NatyamTeaser pic.twitter.com/2keybZkwTH
— BARaju (@baraju_SuperHit) February 9, 2021












