బాబీపై ఎన్టీఆర్ ఫైర్!

ఎన్టీఆర్, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి విదితమే. ఈ సినిమా ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు జరుపుకొని సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘జనతా గ్యారేజ్’ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరగడం సాధారణం. అయితే సినిమా ఇంకా.. పట్టాలెక్కకముందే ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు.. ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు
కొడుతున్నాయి.
నిజానికి ఈ సినిమాకు కీలకమైన విషయం.. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించడం. సినిమాలో ఇదొక పెద్ద ట్విస్ట్ కూడా.. అటువంటి విషయం ఇలా బయటకు రావడం పట్ల ఎన్టీఆర్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు ఎలా వెళ్ళిందో.. ఆరా తీసి దర్శకుడు బాబీను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై సినిమాకు సంబంధించిన ఏ విషయ కూడా బయటకు వెళ్లకూడదని సూచించాడట. ఇకనైనా.. చిత్రబృందం ఈ విషయాల పట్ల
జాగ్రత్తగా ఉంటే మంచిది!