HomeTelugu Big Storiesగుంటూరు కారం: సెకండ్‌ సాంగ్‌ ప్రోమో విడుదల

గుంటూరు కారం: సెకండ్‌ సాంగ్‌ ప్రోమో విడుదల

Oh My Baby Song Promo from
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి. మాస్ గెటప్‍లో మహేశ్ టీజర్, పోస్టర్లు కూడా మరింత ఆసక్తిని పెంచాయి. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో గుంటూరు కారం మూవీ నుంచి రెండో పాట రెడీ అయింది. తాజాగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.

‘ఓ మై బేబీ’ అంటూ మెలోడియస్‍గా ఉన్న ఈ పాటకు థమన్ సంగీతం అందించాడు. మహేశ్, శ్రీలీల మధ్య ఈ డ్యూయెట్ ఉంది. ఈ పాటను శిల్పా రావు ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ‘అమ్ము.. రమణగాడు.. గుర్తు పెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తది..’ అని ఈ ప్రోమోలో శ్రీలీలతో చెబుతాడు మహేశ్ బాబు.

ఈ ప్రోమో చాలా తక్కువగా ఉండడం కాస్త నిరాశ కలిగించే విషయమే. ఈ ప్రోమోలో శ్రీలీల మరింత అందంగా ఉంది. మహేశ్ లుక్ అదిరిపోయింది. ఈ పూర్తి పాట మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 13న రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu