HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌, రానా మూవీ టైటిల్‌ ఇదేనా!

పవన్‌ కళ్యాణ్‌, రానా మూవీ టైటిల్‌ ఇదేనా!

Pawan Kalyan Rana Movie Ti
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజాగా మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో పృథ్వీరాజ్, బిజూమీనన్ పోషించిన ప్రధాన పాత్రలను తెలుగు వెర్షన్ లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పోషిస్తున్నారు.

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగును రెండు రోజుల క్రితం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జంటగా సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిత్రం టైటిల్ విషయానికి వస్తే.. ‘బిల్లా రంగా’ అనే పేరు బాగా వినిపిస్తోంది. చిత్రకథకు ఇది సరైన టైటిల్ అవుతుందని భావిస్తున్నారట. పవన్ కూడా దీనికి ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. దీంతో దాదాపు దీనినే ఫైనల్ చేస్తారని సమాచారం. 1982లో ‘బిల్లా రంగా’ పేరుతో ఓ చిత్రం వచ్చిన సంగతి చాలామందికి తెలిసుంటుంది. చిరంజీవి, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా అప్పట్లో అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu