జగన్ పై హత్యయత్నం.. పవన్‌ స్పందన

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి పట్ల జనసేన అధిపతి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై హత్యయత్నం జరగడం అమానుషమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన బలంగా విశ్వసిస్తుందని తెలిపారు. ఈ హత్య ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరముందన్నారు.

ప్రతిపక్ష నేతపై జరిగిన ఈ దాడిని తీవ్రమైనదిగా జనసేన భావిస్తుంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. గాయం నుంచి జగన్మోహన్ రెడ్డి త్వరగా కొలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలని లేఖలో పవన్ కల్యాణ్‌ పేర్కొన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates