
బేబీ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ వైష్ణవీ చైతన్య. ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తరువాత ఆమెను వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి. తనకి నచ్చిన కథలను ఆమె ఎంచుకుంటూ వెళుతోంది. అలా తాజాగా ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగా ‘డ్యూయెట్’ అనే సినిమా చేయడానికి ఒప్పుకుందని టాక్.
ఆనంద్ దేవరకొండ హీరోగా మిథున్ అనే యువకుడు ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇప్పటికే చాలామంది పేర్లను పరిశీలించారు. చివరికి వైష్ణవీ చైతన్య అయితేనే ఆ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టుగా సమాచారం.
నిజానికి ఈ కాంబినేషన్లో ‘బేబి’ నిర్మాతలే మరో సినిమా చేయాలని భావించారు. కానీ సరైన కథ సెట్ కాకపోవడం వలన, అందుకు సంబంధించిన పనులలోనే ఉన్నారు. ఈలోగానే మిథున్ దర్శకత్వంలో ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.













