
OTT Platforms New Demands:
పాండమిక్ తరువాత ప్రేక్షకులు థియేటర్‌కి తగ్గించి, ఓటీటీపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ డిజిటల్ ట్రెండ్‌ను చూసిన అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ భారతీయ సినిమాల స్ట్రీమింగ్ హక్కుల కోసం పెద్ద మొత్తాల్లో డబ్బు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాల కోసం ఈ సంస్థలు ఏకంగా ప్రాజెక్ట్ స్టేజ్ నుంచే జంప్ అవుతున్నాయి!
మొదట్లో ఇది మంచి అవకాశంలా కనిపించింది. ఓటీటీ డీల్స్‌తో నిర్మాతలు రిస్క్ తగ్గించుకోవచ్చు అనిపించింది. అందుకే చాలా మంది నిర్మాతలు ఓటీటీ డీల్ మీద ఆధారపడి కొత్త సినిమాలు మొదలెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
ఇప్పుడు ఓటీటీ సంస్థలు నిర్మాతల మీదే ప్రభావం చూపించటం మొదలుపెట్టాయి. రిలీజ్ డేట్ కూడా వాళ్లే డిసైడ్ చేస్తున్నారట! అంతే కాదు, సినిమా స్క్రిప్ట్ మొదటి దశ నుంచే వాళ్లను కలిపి తీసుకెళ్లాలన్న నిబంధన పెడుతున్నారు. బౌండ్ స్క్రిప్ట్ వాళ్లకి పంపించాలి, వాళ్లు సూచనలు చేస్తే మార్చాల్సిందే! దర్శకుల క్రియేటివిటీకి ఇది పెద్ద ముప్పు.
ఒక సినిమా అనేది డైరెక్టర్ విజన్ మీద ఆధారపడాలి. కానీ ఇప్పుడు ఓటీటీ పట్టు బిగిస్తోంది. కథ, టెక్నికల్ టీమ్, మేకింగ్ అన్నింటిలో వాళ్లకు హస్తక్షేపం ఉండేలా చూస్తున్నారు. దీని వలన మన దర్శకుల స్వేచ్ఛ తగ్గిపోవచ్చని సినీ పరిశ్రమలో చర్చ మొదలైంది.
ఓటీటీ డబ్బుల కోసమే నిర్మాతలు ఈ ఒత్తిడిని ఓకే అంటున్నారేమో కానీ, దీన్ని కంట్రోల్ చేయకపోతే మన తెలుగు సినిమా క్రియేటివిటీకి ప్రమాదమే అంటున్నారు.
ALSO READ: Aamir Khan Mahabharata సినిమాలో Allu Arjun కి కూడా పాత్ర ఉందా?