
Aamir Khan Mahabharata Movie:
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఓ పెద్ద కలతో ముందుకు వెళ్తున్నాడు. ఆ కల ఏమిటంటే… భారతీయ ప్రేక్షకులకు “మహాభారతం”ను వెండితెరపై గ్రాండ్‌గా చూపించడం. ఈ ప్రాజెక్ట్‌పై ఆయన చాలాకాలంగా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పుడైతే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కి మరింత స్పీడ్ పెరిగింది!
ఇప్పటికే ఆమిర్, మహాభారతాన్ని మొత్తం 5 పార్ట్స్‌గా తీయాలని ఫిక్స్ అయ్యాడట. ఒక్కో పార్ట్‌కు ఒక టాప్ డైరెక్టర్‌ని పెట్టాలనుకుంటున్నాడు. మొదటి భాగాన్ని సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. అంతే కాదు, ప్రతి భాగం రిలీజ్ కి 6 నెలల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం బడ్జెట్? దాదాపు రూ.1000 కోట్లు!
ఇక ఇందులో నటించబోయే నటులు కూడా బంపర్ లెవెల్లో ఉంటారట. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా, టాప్ టాలెంట్‌ని తీసుకురావాలని ఆమిర్ ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా ఇటీవల అల్లు అర్జున్‌ని కూడా కలిసాడట ఆamir. అప్పటికి బన్నీ ముంబైలో Atlee డైరెక్షన్‌లో చేయబోయే సినిమాకి సంబంధించి ఉన్నాడు. వాళ్లిద్దరి మధ్య మహాభారతం ప్రాజెక్ట్ గురించి చర్చ జరిగినట్టు టాక్.
అంతేకాదు, బన్నీని అర్జునుడిగా చూడాలనుకుంటున్నట్టు కూడా బజ్ వినిపిస్తోంది. బహుశా బన్నీ – భన్సాలీ మధ్య జరిగిన కొన్ని మర్చిపోయే భేటీలు కూడా దీన్నే సంకేతిస్తున్నాయేమో! పుష్ప 2 తర్వాత బన్నీ భన్సాలీ ఆఫీసులో కనిపించడం విశేషం.
ఇంకా ఆమిర్ స్వయంగా కృష్ణుడి పాత్రలో కనిపించనున్నారట. ఈ మ్యాగ్నం ఓపస్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: Prabhas Summer Vacation కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?