New troubles for OTT platforms:
ఓటీటీ ప్రపంచంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రముఖ ప్లాట్‌ఫారాలు ఇప్పుడు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ మార్పులు మధ్య 2025 లో విడుదలకు సిద్ధమవుతున్న పలు సినిమాల డిజిటల్ హక్కులు ఇప్పటికీ అమ్ముడుపడలేదట. దీని వలన నిర్మాతలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు.
అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు పేపర్ వ్యూ (Pay-Per-View) డీల్స్ ను మాత్రమే అందిస్తోంది. మరోవైపు, నెట్‌ఫ్లిక్స్ మూడియం బడ్జెట్ సినిమాల కొనుగోలుకు పూర్తిగా దూరంగా ఉంది. సినిమాలు క్వాలిటీగా ఉంటేనే వారు హక్కులను తీసుకునే అవకాశం ఉందట. దీని వల్ల చిన్న, మూడియం బడ్జెట్ చిత్రాల నిర్మాతలు తలనొప్పిని ఎదుర్కొంటున్నారు.
అదే సమయంలో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ జియో సినిమాతో విలీనం అయ్యింది. కొత్త బడ్జెట్ పంపిణీ నిబంధనలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు, జీ స్టూడియోస్ తన ప్రధాన ఫోకస్‌ను ప్రొడక్షన్‌పై మాత్రమే ఉంచుతోంది. ఇది 2025 సంవత్సరంలో డిజిటల్ మార్కెట్‌ను మరింత సంక్లిష్టతరం చేస్తోంది.
2025 లో పండగ సీజన్లలో భారీ స్థాయిలో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ, డిజిటల్ డీల్స్ కోసం సినిమా పరిశ్రమ కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఓటీటీ ప్లాట్‌ఫారాల వ్యూహాల్లో పెద్ద మార్పు అని చెప్పుకోవచ్చు.
ALSO READ: Nagarjuna కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!