ఈ వీకెండ్ బన్నీ మూడో సాంగ్‌

టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్లో ఇది మూడో సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు సంబందించిన రెండు పాటలను ఇప్పటికే విడుదల చేసింది. మూడో సాంగ్ ను ఈ వీకెండ్ లోపలే రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. నివేత పెతురాజ్, సుశాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12 న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నది.