పడి పడి లేచె మనసు మూవీ రివ్యూ

movie-poster
Release Date
December 21, 2018

యువ నటుడు హీరో శర్వానంద్‌, అందమైన ప్రేమ కథల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే మంచి హైప్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో ఆడియన్స్‌ను మరింతగా ఆకట్టుకుంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా. శర్వానంద్‌, సాయి పల్లవిల జంట ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం

కథ: సినిమా కథ నేపాల్‌లో ప్రారంభమవుతుంది. తను ప్రేమించిన అమ్మాయికి దూరమైన హీరో సూర్య(శర్వానంద్‌) తన ప్రేమకథను చెప్పటం ప్రారంభిస్తాడు. కొల్‌కతాలో హీరోరయిన్‌.. వైశాలి (సాయి పల్లవి) అనే మెడికల్ స్టూడెంట్తో ప్రేమలో పడ్డ సూర్య, ఆమె వెంటపడుతుంటాడు. వైశాలి కూడా సూర్యని ఇష్టపడుతుంది. కానీ తన గతం కారణంగా కలిసుందాం గాని పెళ్లి వద్దని సూర్య అంటాడు. దీంతో ఇద్దరు విడిపోతారు సూర్య, వైశాలీలు తిరిగి ఎలా కలిశారు. ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు: శర్వానంద్‌ మరోసారి తనదైన మెచ‍్యూర్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్‌, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి కూడా తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో పర్ఫామ్‌ చేసింది. వైశాలి పాత్రలో జీవించింది. శర్వా, సాయి పల్లవిల నటన సినిమా స్థాయిని పెంచింది. ఇద్దరు నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరగటంతో ఇతర పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఉన్నంతలో ప్రియదర్శి, సునీల్‌, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్‌ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేష‌ణ‌: హను రాఘవపూడి మరోసారి తన మార్క్‌ పొయటిక్‌ ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథా కథనాలు కాస్త నెమ్మదిగా సాగిన విజువల్స్‌, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్‌ ఇలా అన్ని తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. కానీ ఇంటర్వెల్‌ సీన్‌ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్‌ విడిపోవడానికి కారణం అంత అర్ధవంతంగా అనిపించదు. తొలి భాగాన్ని బాగానే తెరకెక్కించి ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. సినిమా రొటీన్ సీన్స్ తో సాగటంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అక్కడక్కడా సునీల్‌ కామెడీ వర్క్‌ అవుట్‌ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముంగిపు సన్నివేశాలు కూడా హడావిడిగా ముగించేసినట్టుగా అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్‌ తన సంగీతంతో మ్యాజిక్‌ చేశాడనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫి, ఆర్ట్‌ అద్భుతం అనిపించేలా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్‌ మణిరత్నం సినిమాలను గుర్తు చేస్తాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

హైలైట్స్
శర్వా, సాయి పల్లవి నటన

డ్రాబ్యాక్స్
సెకండ్‌ హాఫ్‌

చివరిగా : పడుతూ.. లేస్తూ.. పర్వాలేదనిపించిన సినిమా
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

టైటిల్ : పడి పడి లేచె మనసు
నటీనటులు : శర్వానంద్‌, సాయి పల్లవి, మురళీశర్మ, సుహాసిని
సంగీతం : విశాల్‌ చంద్రశేఖర్‌
దర్శకత్వం : హను రాఘవపూడి
నిర్మాత :ప్రసాద్‌ చుక్కపల్లి, సుధాకర్‌ చెరుకూరి

Critics METER

Average Critics Rating: 2
Total Critics:3

AUDIENCE METER

1 Star2 Stars3 Stars4 Stars5 Stars (No Ratings Yet)
Loading...
movie-poster

Critic Reviews for The Boxtrolls

పడుతూ.. లేస్తూ.. పర్వాలేదనిపించిన సినిమా
Rating: 2.5/5

www.klapboardpost.com

పడి పడి లేచె మనసు.. లేచి పడిన సినిమా
Rating: 2.25/5

www.tupaki.com

పడి… పడి.. లేస్తూ..
Rating: 2.5/5

www.telugu360.com