‘పడి పడి లేచే మనసు’ టైలర్‌

యంగ్ హీరో శర్వానంద్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘పడి పడి లేచే మనసు’. కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అయ్యింది. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచిన మూవీయూనిట్‌ టైలర్‌ను రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్‌ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఫిదా చేసేందుకు రెడీ అవుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.