‘పడి పడి లేచే మనసు’ రీషూట్‌..సాయి పల్లవికి ఎక్స్‌ట్రా పేమెంట్‌!

శర్వానంద్‌, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచే మనసు’. ఈ సినిమాని హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కోల్‌కత బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్‌లో రిలీజ్‌ కు రెడీ అవుతోంది. ఇప్పటికే చిత్రయూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సంతృప్తిగా లేని చిత్రయూనిట్ రీషూట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రీషూట్‌కు డేట్స్‌ కేటాయించేందుకు సాయి పల్లవి అదనపు పారితోషికం అడుగుతున్నట్లు సమాచారం. నిర్మాతలు కూడా ఎక్స్‌ట్రా పేమెంట్‌ ఇచ్చేందుకు అంగీకరించారన్న వార్తలు వినిపిస్తోంది.