పవన్ ‘సత్యాగ్రహి’ సినిమా కావాలనే ఆపేశాడంట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక హీరోగా టాప్ స్థానంలో ఉండగానే ఆ స్థాయిని వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సైన్ చేసిన సినిమాల్ని సైతం పక్కనబెట్టి ఆయన రాజకీయాల్లోకి దిగారు. అలా సైన్ చేసిన వాటిలో ‘సత్యాగ్రహి’ కూడ ఒకటి.

ఈ సినిమాను చాలా ఏళ్ల క్రితమే చేయాల్సింది పవన్. కానీ భవిష్యత్తుల్లో రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యం ఉండటంతోనే ఆయన ఆసినిమాను చేయలేదు. అంతేకాదు ఆ సినిమాను నిజ జీవితంలో నిజం చేయడానికే ఆపేశానని కూడ పవన్ తాజాగా అమెరికాలో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు.