HomeTelugu Big Storiesనితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కి పవన్‌ కల్యాణ్‌.. వైరల్‌

నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కి పవన్‌ కల్యాణ్‌.. వైరల్‌

Pawan kalyan attend hero ni

టాలీవుడ్‌ హీరో పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌కు నితిన్ వీర అభిమాని. ఈయన్ని అభిమాని అనడం సరికాదు.. ఎందుకంటే నరనరాల్లో పవన్‌పై ప్రేమను నింపుకున్నాడు ఈ హీరో. అందుకే ఈయన్ని భక్తుడు అంటారు. కాగా ఇప్పుడు నితిన్‌ పెళ్లి చేసుకుంటున్నాడు. మొన్నటికి మొన్న స్వయంగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ తన పెళ్లికి రావాలంటూ ఆహ్వానించాడు. అందులో భాగంగానే ఇప్పుడు నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ వచ్చాడు.

ఈ వేడుకకు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబుతో కలిసి హజరైయ్యాడు పవన్. జులై 26న ఈయన షాలినిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కరోనా నిబంధనలకు లోబడి ఈ పెళ్లి జరిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనికి టాలీవుడ్ నుంచి కానీ.. రాజకీయ రంగం నుంచి కూడా అతికొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఘనంగా పార్టీ ఇవ్వాలని చూస్తున్నాడు నితిన్. ఇదిలా ఉంటే నితిన్ వేడుకకు పవన్ వచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu