మీడియాతో పనేముంది అనుకుంటున్నాడు!

మొన్నటివరకు మన స్టార్ హీరోలు మీడియాను పట్టించుకునేవారే కాదు. కానీ ప్రమోషన్స్ లో మీడియా కీలకపాత్ర తెలుసుకొని ఒక్కొక్కరు మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా పవన్ కూడా తన సర్ధార్ సినిమా కోసం అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ కాటమరాయుడు సినిమా విషయంలో మాత్రం పరిస్తితి వేరుగా ఉంది.

కావల్సినంత హైప్ వచ్చేసింది కదా ఇంక మీడియాతో పనేముందని అనుకుంటున్నాడో.. లేక సర్ధార్ సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో ఎలాంటి ప్రయోజనం ఒరగలేదు ఇక దీనికి మాత్రం ఎందుకు చేయాలనుకుంటున్నాడో కానీ మొత్తానికి ప్రమోషన్స్ ఎగ్గొట్టాడు. ఏదో ప్రీరిలీజ్ ఈవెంట్ తో సరిపెట్టి నేరుగా మార్కెట్ లోకి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. సో.. ఇక మీడియా కలిసే పరిస్థితి కనిపించడం లేదు.