
ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జనసేన పోరాట యాత్రలో బిజీగా ఉన్న.. మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారా? ఆయన సినిమా రిలీజ్ ఎప్పుడంటే? ఇలాంటి వార్తలో కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. కొన్ని వెబ్ మీడియాలోనూ ఇలాంటి న్యూస్ దర్శనమిస్తున్నాయి. అయితే ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… నేను ఒక సినిమాలో నటిస్తున్నా అనేది అవాస్తవమన్న జనసేనాని.. నాకు అంత సమయం లేదు.. పూర్తి సమయం ప్రజా సంక్షేమం కోసమే అన్నారు. కొన్ని మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నట్టుగా నేను సినిమా చేస్తున్నా అనే విషయం నిజం కాదన్న పవన్.. పాలకుల తప్పిదాలను బలంగా వినిపిస్తున్న సమయమిది… అందుకే సినిమాలపై దృష్టి పెట్టడంలేదు.. నా తపన సమ సమాజ స్థాపన కోసమే, ప్రజా జీవితానికే పూర్తి సమయమని స్పష్టం చేశారు పవన్.














