HomeTelugu Trendingశశి మూవీ ట్రైలర్‌

శశి మూవీ ట్రైలర్‌

Pawan kalyan launches sashi
ఆది సాయికుమార్‌- సురభి హీరోహీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శశి’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేశారు. ‘మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది’ అని ఆది చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభవుతుంది.

ఈ సినిమాలో రాజీవ్‌ కనకాల హీరోయిన్‌ తండ్రి పాత్రలో నటించాడు. వెన్నెల కిశోర్ , తులసి, జయప్రకాష్, అజయ్, వైవా హర్ష , సుదర్శన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu