HomeTelugu Big Storiesతీస్‌మార్ ఖాన్: ట్రైలర్‌ విడుదల

తీస్‌మార్ ఖాన్: ట్రైలర్‌ విడుదల

Tees Maar Khan Trailer
టాలీవుడ్ యంగ్‌ హీరో ఆది సాయికుమార్ న‌టించిన తాజా చిత్రం ‘తీస్‌మార్ ఖాన్‌’. క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన తీస్ మార్ ఖాన్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఆగ‌స్టు 19న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ క్రమంలో.. మేక‌ర్స్ తీస్‌మార్ ఖాన్‌ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఆది పాత్ర పోలీసాఫీస‌ర్‌గా ఫ‌న్‌, సీరియ‌స్ యాంగిల్‌లో ఎంట‌ర్ టైనింగ్ ట‌చ్ ఇస్తూ సాగ‌నున్న‌ట్టు ట్రైల‌ర్‌తో చెప్పేశాడు ద‌ర్శ‌కుడు. పాయ‌ల్, ఆది మ‌ధ్య ల‌వ్ ట్రాక్ కూడా మూవీ ల‌వ‌ర్స్ ఎంజాయ్ చేసేలా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విజ‌య్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తిరెడ్డి నిర్మిస్తున్నారు. పూర్ణ‌, సునీల్‌, క‌బీర్ దుహాన్ సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. సాయికార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu