పవన్ కల్యాణ్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన పార్టీపై తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్ అంటూ.. మూడు నెలల క్రితం పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌ను విపరీతంగా సర్క్యులేట్ చేస్తోంది జనసేన పార్టీ. సోషల్ మీడియాలో వివిధ గ్రూపుల్లో ఇది ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది… జనసేన పోరుబాట సమయంలో మూడు నెలల క్రితమే పవన్ ఈ ట్వీట్ చేశారు… ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. పవన్ ట్వీట్‌ను పరిశీలించినట్లయితే… ”అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఉంది. జనసేన ఆ పార్టీతో కలుస్తుంది, ఈ పార్టీతో కలుస్తుందని కొందరు అంటే, కలవడమే కాదు.. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని మరికొందరు అంటున్నారు.. మనకు ఏ పార్టీ అండా దండా అక్కర్లేదు.. ‘మన బలం జనం.. చూపిద్దాం ప్రభంజనం’ అంటూ గతంలోనే
పవన్ కల్యాణ్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.