శ్రీనివాస్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ అభినందనలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడీయన్ శ్రీనువాస్ రెడ్డిని అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్, రీసెంట్ గా జయమ్ము నిశ్చయమ్మురా సినిమాని చూసారు.  కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా క్లీన్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. 

జయమ్ము నిశ్చయమ్ము రా లో ” అత్తారింటికి దారేది” సినిమా కూడా ఒక కీ రోల్ పోషించింది. ఆ సినిమా బ్యాక్ డ్రాప్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ని డిజైన్ చేసాడు దర్శకుడు శివాజి. ఆ సీన్స్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా లొనే పవన్ ఇమేజ్  కొన్ని సన్నివేశాలు బలం అందించింది.

జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ప్రేక్షకులను, విమర్శకులను బాగా మెప్పించింది. నటుడిగా శ్రీనివాస్ రెడ్డి స్థాయిని కూడా పెంచింది. సినిమా చూసిన చాలా మంది శ్రీనివాస్ రెడ్డిని మెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి అభినందనలు లభించాయి. ‘నువ్వొక మంచి సినిమా చేశావు. సినిమా చూసి ఎంజాయ్ చేశాను. నీకు నా బెస్ట్ విషెస్’ అని అభినందిస్తూ ఒక ఫ్లవర్ బొకేని శ్రీనివాస్ రెడ్డికి పంపారు పవర్ స్టార్. 

జయమ్ము నిశ్చయమ్మురా ఇచ్చి సక్సెస్ తో, కొత్త సినిమాల మీద ఫోకస్ చేస్తూ బిజీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, సడన్ గా వచ్చిన పవన్ విషెస్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి శ్రీనివాస్ రెడ్డి చెబుతూ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు.