HomeTelugu Big StoriesPawan Kalyan అనారోగ్యం.. అసలు ఏమైందో తెలుసా?

Pawan Kalyan అనారోగ్యం.. అసలు ఏమైందో తెలుసా?

Pawan Kalyan’s Health Issue.. What’s Really Happening?
Pawan Kalyan’s Health Issue.. What’s Really Happening?

Pawan Kalyan health update:

Pawan Kalyan అనారోగ్యంతో బాధపడుతున్నారని జనసేన అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా, ఆయనకు వైరల్ ఫీవర్‌తో పాటు స్పాండిలైటిస్ అనే సమస్య ఉంది. దీంతో పవన్ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడిపోతున్నారు.

స్పాండిలైటిస్ అనేది వెన్నుముకకు సంబంధించిన వ్యాధి. దీని వల్ల తీవ్ర వెన్నునొప్పి, మెడ కదలకుండా ఉండిపోవడం, అలసట, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ సమయం పని చేయడం, ఒత్తిడికి గురికావడం వల్ల ఇది వస్తుంది. ముదిరితే చేతుల కండరాలు బలహీనపడిపోవచ్చు.

పవన్ కళ్యాణ్ గతంలోనూ వెన్నునొప్పితో బాధపడ్డారు. ఇప్పుడు స్పాండిలైటిస్ రావడంతో ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కారణంగా రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోయారు.

అనారోగ్యం ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘OG’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘హరిహరవీరమల్లు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు ఎంతటి విజయాలు సాధిస్తాయో చూడాలి!

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ సినీ, రాజకీయ రంగాల్లో ఫుల్ ఎనర్జీతో తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ALSO READ: 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!