పవన్ సరసన మలయాళీ ముద్దుగుమ్మ!

పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించాలని చాలా మంది కోరుకుంటారు. అయితే
ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆయన సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది మలయాళీ
ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ‘అ ఆ’, ‘ప్రేమమ్’ చిత్రాలతో తెలుగు వారికి పరిచయమయిన
అనుపమ పరమేశ్వరన్, పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో
హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండడంతో
ముందుగా సమంతను ఎంపిక చేశారు. ఇక ఇటీవల త్రివిక్రమ్ ‘అ ఆ’లో సినిమాలో మెరిసిన
అనుపమానే ఆయన మరొకసారి తన సినిమాలో నటించడానికి ఛాన్స్ ఇచ్చాడు. అ ఆ లో
నటించిన ఇద్దరు భామలు మరోసారి కలిసి ఈ సినిమాలో నటించడం విశేషం.