పవన్ సిద్ధమవుతున్నాడు!

పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కాటమరాయుడు’ రెగ్యులర్ షూటింగ్
ఆలస్యమవుతూ వస్తుంది. నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని చాలా రోజులు
అయింది. కానీ ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. డైరెక్టర్ మారడం,
రాజకీయాల్లో పవన్ బిజీగా గడపడం వంటి పనుల వలన లేట్ అవుతూ వచ్చింది. కానీ
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 24నుండి జరగనుంది. ఇదే
రోజు నుండి పవన్ షూటింగ్ లో పాల్గొనున్నాడు. శృతిహాసన్ ఈ సినిమాలో పవన్ సరసన
కనిపించనుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే సంవత్సరం రిలీజ్ చేయాలని
భావిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates