బాబూ అఘాయిత్యాలు చేయొద్దు: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు సంధించారు. ‘నోరు చేసే అఘాయిత్యాలను పొట్ట భరించలేదు’ అని ట్వీట్‌ చేశారు. అవకాశవాద రాజకీయాలతో, పూటకో మాట మార్చే రాజకీయ నాయకులతో ప్రజలువిసుగు చెంది ఉన్నారని పేర్కొన్నారు. నీచ రాజకీయాలతో ప్రజలు అలిసిపోయారని.. ‘ఇంకా మీ నోటితో ప్రజలు మీద చేసే అఘాయిత్యాలు చేయొద్దు బాబూ’ అని పోస్ట్‌ చేశారు. దాంతోపాటు.. బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్‌ చేసిన ట్వీట్‌(అబద్ధమని తెలిసినా.. నిజమని ఇతరులను నమ్మించేందుకు ప్రయత్నించేవారితో వాదన అనవసరం) ను రీట్వీట్‌ చేస్తూ.. ‘ఈ కామెంట్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది’ అని విమర్శించారు.