వెంకీ, రవితేజ సినిమాలో ‘పాయల్‌’.. ఫొటోలు వైరల్‌


హాట్‌ బ్యూటీ ..పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సంచలన తారగా మారింది. ఆర్ఎక్స్ 100 సినిమాతో బాణంగా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన ఈ భామ సీత సినిమాలో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఆ తరువాత ఇప్పుడు ఈ అమ్మడు వెంకీ మామ, రవితేజతో డిస్కోరాజా సినిమాలు చేస్తున్నది. వెంకీమామ డిసెంబర్ 13 వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈరోజు పాయల్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన రెండు ఫోటోలను రిలీజ్ చేశారు. వెంకీమామ సినిమాలో టీచరమ్మగా వెంకటేష్ కు ప్రేమ పాఠాలు బోధించి మనసుదోచుకోగా, రవితేజ డిస్కో రాజాలో గన్ను చేతపట్టి యాక్షన్ చేసింది. ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ఎక్స్ 100 సినిమాలో హాట్ హాట్ ముద్దులతో యూత్ ను ఆకట్టుకున్న పాయల్ ఈ రెండు సినిమాల్లో ఎలా ఆకట్టుకుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

CLICK HERE!! For the aha Latest Updates