HomeTelugu Newsగోల్డెన్ ఛాన్స్ వచ్చిందంటున్న పాయల్

గోల్డెన్ ఛాన్స్ వచ్చిందంటున్న పాయల్

13 2
ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రతో ఆకట్టుకుంటోంది. తాజాగా అందాల తార రాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న 5Ws చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో పాయల్ కీలక పాత్ర చేస్తోంది. ఓ పోలీసు ఆఫీసర్‌గా కనిపించబోతుంది. తాను విజయశాంతి స్ఫూర్తితోనే ఈ సినిమాలో పోలీసు అధికారిగా నటిస్తున్నానని.. అలా నటించాలని ఏ నటికి ఉండదు అంటూ ఆ గోల్డెన్ ఛాన్స్ నాకు వచ్చింది అంటోంది. ఇది నా కెరీర్‌లోనే కొత్త చిత్రం. నాపై నమ్మకముంచి ఈ అవకాశమిచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు చెప్తోంది. ఆయన కథ చెప్పగానే వెంటనే ఒప్పేసుకుందట. ఈ సినిమాలో ఫైట్స్ కూడా చేసిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu