HomeTelugu Trendingమంగళవారం: పాయల్ రాజ్‌పుత్‌ పోస్టర్‌ విడుదల

మంగళవారం: పాయల్ రాజ్‌పుత్‌ పోస్టర్‌ విడుదల

Payal Rajput first look fro

టాలీవుడ్‌లో ‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఈ సినిమా ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఇక పాయల్‌ రాజ్‌పుత్‌ బోల్డ్‌ నటనతో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ సినిమాకి అజయ్‌ భూపతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్‌, శర్వానంద్‌తో తెరకెక్కించిన మల్టిస్టారర్‌ మూవీ ‘మహాసముద్రం’ తొలిరోజు నుంచి బాక్సాఫీస్‌ దగ్గర తేలిపోయింది.

ఇక ఇప్పుడు మళ్లీ అజయ్‌ తనకు హిట్టిచ్చిన బోల్డ్‌ జానర్‌లోనే మంగళవారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాలోని హీరోయిన్‌ పోస్టర్‌ను రివీల్‌ చేశారు. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌ శైలజ అనే పాత్రలో నటిస్తుంది. ఈ మేరకు మేకర్స్‌ ఓ బోల్డ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పాయల్‌ రాజ్‌పుత్‌ పోస్టర్‌ సినిమాపై ఒక్క సారిగా అంచనాలు పెంచింది. అంతేకాకుండా పాయల్‌ కంట్లో నుంచి నీళ్లు రావడం కూడా పోస్టర్‌లో చూపించారు. దాంతో ఈ సినిమా కేవలం బోల్డ్‌ కంటెంట్‌తోనే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త కథను చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

గ్రామీణ నేపథ్యంలో 1990లో జరిగే కథ ఇదిని తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియాలో సినిమా రాలేదని అజయ్‌ భూపతి తాజాగా వెల్లడించాడు. సినిమాలో ముప్పై పాత్రలున్నాయని, ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలిపాడు. షూటింగ్‌ చివరిదశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu