HomeTelugu Trendingతేజ సినిమాలో పాయల్‌..!

తేజ సినిమాలో పాయల్‌..!

4 13మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ను షేక్‌ చేసిన బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. తొలి ప్రయత్నంలోనే గ్లామర్‌ షోతో పాటు నెగెటివ్‌ రోల్‌లోనూ ఆకట్టుకున్నారు. ప‍్రస్తుతం ఆర్డీఎక్స్‌ లవ్‌ సినిమాతో పాటు రవితేజ హీరోగా తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమాల్లో పాయల్ నటిస్తున్నారు‌. తాజాగా ఈ భామకు మరో క్రేజీ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల సీత సినిమాతో నిరాశపరిచిన తేజ తన తదుపరి చిత్రాన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌కు చాన్స్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పాయల్‌ నటించబోయేది హీరోయిన్‌గా కాదు. ఓ స్పెషల్ సాంగ్‌ కోసం ఈ బ్యూటీని తీసుకున్నాడట తేజ. గతంలో తేజ తెరకెక్కించిన సీత సినిమాలోనూ పాయల్‌ రాజ్‌పుత్‌ స్పెషల్ సాంగ్‌లో అలరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu