Homeపొలిటికల్ప్చ్.. బటన్ రెడ్డి వృద్ధులను కూడా వదలడం లేదుగా !

ప్చ్.. బటన్ రెడ్డి వృద్ధులను కూడా వదలడం లేదుగా !

jagan

ఆంధ్ర రాష్ట్రంలో పింఛన్లను తగ్గించడం లేదని, ఎటువంటి కోతలు విధించలేదని సాక్షాత్తు సీఎం జగన్ రెడ్డి అదే మన బటన్ మోహన్ రెడ్డి గోరు సెలవిచ్చారు. ఆచరణలో మాత్రం అది పచ్చి అబద్ధమని పింఛన్లను కోల్పోయిన వృద్ధుల కన్నీళ్లు రుజువు చేస్తున్నాయి. ఉదాహరణకు..గొట్టుముక్కలకు చెందిన కొండయ్య అనే ఓ పెద్దాయనకు గత రెండు సంవత్సరాలుగా వృద్ధాప్య పింఛను వస్తుంది. ఈ నెలలో ఆ పెద్దాయనకు నోటీసు ఇచ్చారు. మీ కుమారుడు ఇన్ కమ్ టాక్స్ కడుతున్నారని, కాబట్టి ఇక మీకు పింఛన్ రాదు అని తేల్చేశారు.

అసలు ఇన్ కమ్ టాక్స్ గురించే తెలియని ఆ పెద్దాయన కుటుంబ సభ్యులు భోరుమన్నారు. ఇదేంటి అని అధికారులను అడిగితే.. మాకేం తెలియదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అలాగే మరో ఉదాహరణ.. గుంటూరు జిల్లాకి చెందిన రావి సుబ్బారావు అనే 75 ఏళ్ల తాతకు కూడా ఇదే సమస్య ఎదురైంది. వాస్తవంగా సుబ్బారావుకి కొడుకే లేదు. ఆయన అన్నయ్య కుమారుడు ఉన్నాడు. తన అఅన్నయ్య కుమారుడికి తనకు సంబంధం లేదు.

సుబ్బారావు గుంటూరులో కాపురం ఉంటుండగా.. ఆయన అన్న కుమారుడు తన కుటుంబంతో కర్ణాటకలోని గంగావతిలో ఉంటున్నారు. కనీసం వీరిద్దరికి సరిగ్గా పలకరింపులు కూడా లేవు. అయినా సుబ్బారావుకి ఇన్ కమ్ టాక్స్ లింక్ పెట్టారు. కాకినాడలో అంజయ్య రూపంలో మరో ఉదాహరణ కూడా ఉంది. ఎప్పుడో భార్య చనిపోయింది. అంజయ్య ఒంటరివాడైనందున అంజయ్యకు ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు లేనందున పింఛనుకు అర్హుడు కాదని ఒక వాదన చెబుతున్నారు.

సరే అని రేషన్ కార్డుకు అంజయ్య దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. అధికారులు మంజూరు చేయలేదు. ఇప్పుడు ఏకంగా అంజయ్యకి పింఛన్లు కూడా నిలిపివేశారు. మరి దీనికి ప్రభుత్వ అధికారులు ఏమి సమాధానం చెబుతారు ?, ఒకవైపు బటన్ రెడ్డి పింఛన్లు రద్దు చేయడం లేదని చెబుతుంటే.. అధికారులు మాత్రం యధావిధిగా ఏదో ఒక సాకు చెప్పి పింఛన్ల సంఖ్య తగ్గించుకుంటూ పోతున్నారు. మొత్తానికి బటన్ రెడ్డి వృద్దులను కూడా వదలడం లేదు. వాళ్ళను కూడా వేధిస్తున్నాడు ఛీ..!!

Recent Articles English

Gallery

Recent Articles Telugu