మలయాళంలో పెళ్ళిచూపులు!

చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం ‘పెళ్లి చూపులు’. ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండల డిమాండ్ బాగా పెరిగిపోయింది. విజయ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అలానే తరుణ్ భాస్కర్ దగ్గుబాటి కుటుంబంలోని హీరోతో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు.

తెలుగులో భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమాను ఇతర బాషల్లో రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులతో పాటు తమిళ, హిందీ రీమేక్ హక్కులు కూడా భారే రేటుకి అమ్ముడిపోయినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్రాన్ని మలయాళంలోకి డబ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ‘బార్బెక్యూ” ఒరు పెన్ను కనలింటే కథ’ అనే పేరుతో మలయాళంలోకి అనువాదిస్తున్నారు. న్యూ సూర్యా ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని కేరళలో విడుదల చేయబోతోంది. ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోందనే నమ్మకంతో ఉన్నారు.