ఆ నిర్మాతపై శర్వా కోపంగా ఉన్నాడట!

శర్వానంద్ హీరోగా ఇటీవల ‘శతమానం భవతి’ సినిమా రిలీజ్ అయి పెద్ద హిట్ ను సొంతం చేసుకుంది. రెండు పెద్ద సినిమాలతో పోటీ పడి ఇప్పటికీ తన జోరుని కొనసాగిస్తోంది ఈ చిత్రం. అయితే ఇప్పుడు శర్వానంద్ చిత్ర నిర్మాత దిల్ రాజు పై కోపం గా ఉన్నాడట. హిట్ ఇచ్చిన నిర్మాతపై కోపం ఎందుకు అనుకుంటున్నారా..? దానికి ఓ కారణం ఉంది.

దిల్ రాజు నిర్మించిన ‘నేను లోకల్’ సినిమా శుక్రవారం విడుదలయింది. మొదటి షో నుండే సినిమాకు మంచి టాక్ లభించింది. అయితే ఈ సినిమా థియేటర్ల కోసం శతమానం భవతి సినిమా ఆడుతున్న కొన్ని థియేటర్స్ నుండి సినిమాను తీసేసి నేను లోకల్ ప్రదర్శించారట. బాగా ఆడుతున్న సినిమాను అలా తీసేయడం పట్ల శర్వా కాస్త అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దిల్ రాజు తో మాట్లాడడం ఇష్టంలేక తనలో తాను మదన పడుతున్నాడు.