అన్నీ మంచి శకునములే: ఆకట్టుకుంటున్న పెళ్లి సాంగ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం అన్నీ మంచి శకునములే. మాలవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని స్వప్న సినిమా మరియు మిత్ర విందా మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ సినిమాను నిర్మిస్తున్నారు.

అయితే శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే లిరికల్ వీడియో సాంగ్ విడులైంది. సీతా కల్యాణ వైభోగమే.. అంటూ సాగే ఈ పాటను ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. పెళ్లిపై తీసిన ఈ పాట అందర్ని ఆకట్టుకుంటుంది. ఈ పెళ్లిలో అనేక రకాల భావోద్వేగాలు ప్రేమ ఆప్యాయతలు ఉంటాని ఈ పాటలో చక్కగా చూపించారు.

నిన్న విడుదలైన ఈ పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పాటను చంద్రబోస్ రాయగా… మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఛైత్ర అండిపూడి శ్రీకృష్ణ ఈ పాటను ఆలపించారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ గా శివమ్ రావు కాస్యూమ్ స్టైలిస్ట్ గా పల్లవి సింగ్ పీఆర్ఓగా వంశీ శేఖర్ వ్యవహరిస్తున్నారు. అయితే అన్నీ మంచి శకునములే.. ఈ సారి వేసవికి చల్లని చిరుగాలి అనే క్యాప్షన్ తో ఉన్న ఈ సినిమా మే 18ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates