‘పిట్టగోడ’ రిలీజ్‌కి రెడీ!

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పిట్టగోడ’. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అయింది.
ఈ సందర్భంగా నిర్మాత రామ్మోహన్‌ పి. మాట్లాడుతూ.. ”ఉయ్యాలా జంపాలా తర్వాత మా బేనర్‌లో వస్తోన్న మరో విభిన్న చిత్రం ‘పిట్టగోడ’. ఈ చిత్రం ద్వారా విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, అనుదీప్‌ కె.వి. దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి, టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీ అయింది. ‘పిట్టగోడ’ మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది” అన్నారు.
విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్‌ రాజు, శివ ఆర్‌.ఎస్‌., శ్రీకాంత్‌ ఆర్‌.ఎన్‌. ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: ‘ప్రాణం’ కమలాకర్‌, నిర్మాతలు: దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి., దర్శకత్వం: అనుదీప్‌ కె.వి.