HomeTelugu News'సైరా' చూస్తూంటే ఒళ్ళు గగుర్పొడిచింది: లోకేష్‌

‘సైరా’ చూస్తూంటే ఒళ్ళు గగుర్పొడిచింది: లోకేష్‌

11 2

‘సైరా’ చిత్రంపై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ మూవీగా భావిస్తున్న ఈ సినిమాని ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా ‘సైరా’ అని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా చిరంజీవిగారి 12 ఏళ్ళ కల అని నారా లోకేష్‌ తెలిపారు. తన కలను ఎంతో అద్భుతంగా చిరంజీవి ఆవిష్కరించుకున్నారని లోకేష్ వెల్లడించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్య పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచిందని నారా లోకేష్‌ చెప్పారు. చిత్రయూనిట్ కు తన అభినందనలు తెలియజేశారు. ఎంతో కష్టపడి, ‘సైరా’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, ఘనవిజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి, ఇతర టెక్నీషియన్లు, యూనిట్ సభ్యులకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చిన చిత్రంగా ‘సైరా’ను అభివర్ణించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu