HomeTelugu Big Storiesప్రజలే సైనికులు: మోడీ

ప్రజలే సైనికులు: మోడీ

5 23
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 64వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రశంగించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.. ఈ పోరులో ప్రతి భారతీయుడు సైనికుడేనని ఆనయ అన్నారు.

”కరోనాపై సమరానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నారు. కరోనాపై యుద్ధంలో ప్రపంచ దేశాలకు భారత్‌ పౌరులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కష్ట సమయంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారు. అవసరమైన ఔషధాలను అనేక దేశాలకు అందించాం. ప్రపంచ మానవాళి పట్ల మానవాతా దృక్పథంతో వ్యవహరించాం. కరోనాతో ఉపాధి కోల్పోయినవారిని ఆదుకుంటున్నాం. రోజువారీ ఆదాయంతో బతికే ఆటో డ్రైవర్లు, కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. స్వచ్ఛభారత్‌, శౌచాలయాల నిర్మాణాల్లోనూ ప్రజలు స్పందించారు. జీవనశైలి, పని విధానంలో కరోనా అనేక మార్పులు తెచ్చింది. ఒకప్పుడు మాస్కు వేసుకుంటే రోగిగా చూసేవారు. కరోనా ద్వారా వచ్చిన మార్పులతో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాల్సి వస్తోంది. జబ్బు వచ్చిన వ్యక్తి వద్దకు వెళ్లినప్పుడు మాత్రమే పండ్లు తీసుకెళ్లేవారు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఇప్పుడు అందరూ పండ్లు తినాలి. విపత్తు వేళ రైల్వే సిబ్బంది సేవలు ప్రశంసనీయం. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి” అని మోడీ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu