HomeTelugu Newsకరోనాను ఆపగలిగేశక్తి ప్రభుత్వాలకు లేదు: మంత్రి ఈటల

కరోనాను ఆపగలిగేశక్తి ప్రభుత్వాలకు లేదు: మంత్రి ఈటల

11 23
తెలంగాణాలో కరోనా మహమ్మారి గురించి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందన్నారు. ప్రస్తుతం ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నందున కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిలోనే ఎక్కువ శాతం కరోనా కేసులు నమోదవుతున్నందున ఇకపై పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదని అన్నారు. కరోనా ఇప్పుడే పోయేది కాదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా ప్రారంభంలోని మొదటి 2 నెలలు లాక్ డౌన్ విధించి కఠిన ఆంక్షలు అమలుచేశాం కాబట్టే ఎక్కువ స్థాయిలో విస్తరించ లేదని అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనాను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దన్నారు. జూన్, జులై నెలల్లో కరోనా మరింత విస్తరించే అవకాశం ఉందని అన్నారు. కరోనాను అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదన్నారు. ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu