మెగాహీరోతో దిల్ రాజు ప్లాన్!

మెగా హీరోల్లో సాయి ధరం తేజ్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి మంచి ర్యాపో ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మాసివ్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాక్. ఈ మధ్య తేజు రెండు డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. దీంతో అతడి తదుపరి సినిమా ‘జవాన్’ మీద ఎలాంటి అంచనాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ మెగామేనల్లుడుకి హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు దిల్ రాజు.

సతీష్ వెగ్నేస దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమాలో మొదట హీరోగా రాజ్ తరుణ్ ను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ స్థానంలోకి సాయి ధరం తేజ్ ను తీసుకున్నట్లుగా సమాచారం. తేజు కూడా ఈ బ్యానర్ లో మరోసారి పని చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. మరి తేజు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటాడో.. చూడాలి!