విశాల్ పై పోలీస్ కంప్లైంట్!

తమిళ స్టార్ హీరో విశాల్ తనను చంపేస్తానని బెదిరిస్తున్నడంటూ వడపలని పోలీస్ స్టేషన్ లో నిర్మాత సురేష్ కామాక్షి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కోలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. నడిగర్ సంఘంతో పాటు నిర్మాతల మండలిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోన్న విశాల్ పలు మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారి మెప్పుని సైతం పొందుతున్నాడు. అలాంటిది ఇప్పుడు విశాల్ పై బెదిరింపు కేసు వేయడాన్ని అందరినీ ఆశ్చర్యానికి
గురిచేస్తోంది.

ఇటీవల విశాల్ కు కొందరు నిర్మాతలకు అసలు పడడం లేదట. మంత్రి మండలి అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పటి నుండే ఈ గొడవలు మొదలయ్యాయని టాక్. అప్పటినుండే సురేష్ కు విశాల్ కు మధ్య రాజకీయాలు నడుస్తున్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. నడిగర్ సంఘం సొంత బిల్డింగ్ కోసం విశాల్ ఎంతో కృషి చేశాడు. అయితే అది కబ్జా చేసిన ల్యాండ్ అని కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా సురేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో విశాల్ కొందరు వ్యక్తులతో ఫోన్ చేయించి అతడిని బెదిరించినట్లుగా సురేష్ కామాక్షి తన పిర్యాదులో వెల్లడించాడు.