బెజవాడ వైసీపీ సెంట్రల్‌లో సెగలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ అకలబూనారు… దీంతో బెజవాడ వైసీపీ సెంట్రల్‌లో సెగలు రాజుకున్నట్టైంది… బెజవాడ సెంట్రల్ సీటును వంగవీటి రాధా ఆశిస్తుండగా… బందరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించే ఉద్దేశంలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సెంట్రల్ నుంచే పోటీకి దిగుతానని స్పష్టం చేసిన రాధా… ఈ రోజు జరిగిన వైసీపీ వాణిజ్య సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.

వైసీపీ వాణిజ్య సమావేశంలో రేపటి నుంచి తెలపెట్టిన గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని… బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్వహించాలంటూ మల్లాది విష్ణుకి సంకేతాలు ఇచ్చింది వైసీపీ అధిష్టానం… దీంతో అలిగి సమావేశం నుంచి వెళ్లిపోయారు రాధా. మరోవైపు అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ అంతర్గత విభేదాలపై కూడా వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఉంది… వర్గాలు కాకుండా కలిసి పనిచేయాలని పార్టీ జిల్లా ఇంఛార్జ్ పెద్దిరెడ్డి హితవుపలికారు.