HomeTelugu Trendingఅవికా గోర్‌ 'పాప్‌కార్న్‌' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

అవికా గోర్‌ ‘పాప్‌కార్న్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

Popcorn Movie first look Te

సాయి రోనక్‌, అవికా గోర్‌ హీరోహీరోయిన్‌లుగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు అవికా గోర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ మూవీ కి ‘పాప్‌కార్న్‌’ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ మురళీ నాగ శ్రీనివాస్‌ గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఆచార్య క్రియేషన్స్‌ పతాకంపై భోగేంద్ర గుప్తా మడుపల్లి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో అవికా నిర్మాతగా మారుతుంది. ‘‘వాణిజ్య ప్రకటనల రంగంలో ఎంతో అనుభవం ఉన్న మురళీ చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నాం. ఈ తరానికి సంబంధించిన న్యూఏజ్‌ కథ ఇది’’ అని నిర్మాత చెప్పారు.

డైరెక్టర్‌ మురళీ నాగ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘మెలోడ్రామా జానర్‌లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం ఉన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి.. తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి ఎలా తప్పించుకున్నారు అన్నది థ్రిల్లింగ్‌గా చెబుతున్నాం’’ అని తెలిపారు. అవికా గోర్‌, ఎంఎస్‌ చలపతిరాజు ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu