కొత్త సినిమా కోసం.. హీరో కసరత్తులు

హీరో సుధీర్‌బాబు తన తదుపరి సినిమాల కోసం జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం సుధీర్‌బాబు చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ‘v’ సినిమాతో పాటు ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రకు తగినట్లుగా శరీరాకృతిని మలుచుకునేందుకు కఠినంగా కసరత్తులు చేస్తున్నారు

ఆయన జిమ్‌ చేస్తున్న ఫొటోలను చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాయి. ఆ ఫొటోల్లో సుధీర్‌బాబు మునుపటి కంటే మరింత ఫిట్‌గా కనిపిస్తున్నారు. తాను కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి సినిమా సినిమాకి ఎన్ని కిలోల బరువు పెరిగారో వివరిస్తూ ఇటీవల ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివరాలను సుధీర్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు